ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి: జగన్ డిమాండ్
Advertisement
- స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారం యంత్రాంగం విఫలమైందన్న జగన్
- ఈసీ ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శ
- చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని ఆరోపణ
Advertisement
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేస్తోందని ఆదివారం ఆయన తీవ్రంగా ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని జగన్ విమర్శించారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ వర్గాలు మాటువేసి, వైసీపీ అభ్యర్థులను దౌర్జన్యంగా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కేవలం రెండు రోజుల ముందు రిజర్వేషన్లు ప్రకటించి, 24 గంటల్లో నామినేషన్లు వేయమనడం ప్రతిపక్షానికి సమయం ఇవ్వకూడదనే కుట్రలో భాగమేనని ఆరోపించారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నప్పుడు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసినా తాము ధైర్యంగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించామని జగన్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆ ధైర్యం లేదని విమర్శించారు.
అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసకు వైసీపీనే కారణమని టీడీపీ ఆరోపిస్తుండగా, తమ ఎంపీపైనే దాడి జరిగిందని వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ మిథున్ రెడ్డి వందలాది మంది అనుచరులతో రావడం వల్లే ఉద్రిక్తత తలెత్తిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలపై ఇరు పార్టీల నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ ఆరోపణలపై ఈసీ నివేదికలు కోరినట్లు సమాచారం.